Thursday, September 16, 2021

T20 World Cup: జట్టుని ప్రకటించిన పాకిస్థాన్

యూఏఈ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ కోసం జట్టుని పాకిస్థాన్ ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును సోమవారం పాకిస్తాన్​ క్రికెట్ బోర్డు  ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్​ బ్యాట్స్​మన్​ బాబర్​ అజామ్​ నాయకత్వం వహించనున్నాడు. 15 మందితో కూడిన ఈ జట్టులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌, సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కి చోటు దక్కకపోగా.. సీనియర్ ఓపెనర్ ఫకార్ జమాన్‌‌ని రిజర్వ్‌లో ఉంచారు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. గ్రూప్-2లో ఉన్న పాకిస్థాన్ తన ఫస్ట్ మ్యాచ్‌లోనే భారత్‌తో అక్టోబరు 24న దుబాయ్‌ వేదికగా తలపడనుంది. వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ భారత్‌పై పాకిస్థాన్ గెలవలేదు.

టీ20 వరల్డ్‌కప్‌కి పాకిస్థాన్ జట్టులో బాబర్ అజామ్ (కెప్టెన్), షదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, అజామ్ ఖాన్, హారీస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీమ్, కౌదిల్ షా, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హసనైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీమ్ జూనియర్, షాహీన్ అఫ్రిది, సోహెబ్ మక్సూద్ లకు చోటు దక్కింది.

ఇది కూడా చదవండి: కేంద్రం ఇచ్చిన కోవిడ్ గైడ్ లైన్స్ మార్చగలరా?: సోముకు వెల్లంపల్లి ప్రశ్న

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News