Saturday, April 20, 2024

స్విగ్గీ డెలివ‌రీ బాయ్స్ డిమాండ్స్ ..నెర‌వేర్చ‌ని ప‌క్షంలో స‌మ్మె ..

ఆన్ లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ స్విగ్గీ డెలివ‌రీ బాయిస్ స‌మ్మెకు రెడీ కానున్నారు. త‌మ క‌నీస ఛార్జీలు, ఇత‌ర‌త్రా ప్రోత్స‌కాల‌ను డిమాండ్ చేస్తూ యాజ‌మాన్యానికి వారం రోజుల గ‌డువును ఇచ్చారు. హైద‌రాబాద్ లో ప‌ని చేస్తున్న స్విగ్గీ డెలివ‌రీ బాయ్స్ స‌మ్మెకు సిద్దం కానున్నారు. పలు డిమాండ్లను యాజమాన్యం ముందుంచామని.. సోమవారం నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి లో 10 వేల మంది డెలివరీ బాయ్స్‌ సమ్మెలో పాల్గొంటారని వివరించారు.

తమ డిమాండ్ల పై స్పందన రాకుంటే… డిసెంబర్‌ 5 వ తేదీ నుంచి సమ్మె చేస్తామని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ ఫార్మ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. స్విగ్గీ సీఈవో శ్రీ హర్ష మజేటీ, హైదరాబాద్‌ మేనేజర్‌ కు ఈ మేరకు లేఖలు పంపామని తెలిపారు. ”స్విగ్గీ బాయ్స్‌ కు కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదు. పెట్రోల్‌ ధరలు పెరిగినా… వారికి చెల్లించాల్సిన చార్జీల్లో మార్పులేదు. కస్టమర్‌ దగ్గరి నుంచి తిరిగి హోటల్‌ రావడానికి అయ్యే ఖర్చు జమ కట్టడం లేద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement