Saturday, April 20, 2024

Bigg Boss 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..

బిగ్ బాస్ సీజన్ 5 ఆరో వారం కొనసాగుతోంది. ఆరో వారానికి సంబంధించి ఎవరు ఎలిమినెట్ అవుతారు? అన్న అందరిలో ఆత్రుత పెంచుతోంది. గత వారం హమీదా హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ఆరో వారంలో ఏకంగా ప‌ది మంది నామినేట్ అయ్యారు. విశ్వ, జెస్సీ, రవి, మానస్, ప్రియాంక, లోబో, సిరి, సన్నీ, శ్వేత, శ్రీరామ చంద్ర ఈవారం నామినేటెడ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. నామినేష‌న్‌లో ఉన్న వారిలో శ్రీరామ్ చంద్ర‌, ష‌ణ్ముఖ్‌, యాంక‌ర్ ర‌వి సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ వారం శ్వేత ఎలిమినేట్ కానుంది.

నిజానికి హౌజ్ మేట్స్ అందరిలో శ్వేత, విశ్వకు అతి తక్కువ ఓట్లు వచ్చాయట. అయితే, విశ్వ ఈ వీక్ కెప్టెన్ గా రెండోసారి మరోసారి ఎన్నిక కావడంతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో అతి తక్కువ ఓట్లు వచ్చిన శ్వేత వర్మకు ఆరో వారంలో ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. బిగ్ బాస్ సిజన్ 5లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభం కాగా.. తొలివారంలో సరయు, రెండోవారంలో ఉమాదేవి, మూడోవారంలో లహరి, నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్, ఐదో వారంలో హమీదా ఎలిమినేట్ అయ్యారు.

ఇది కూడా చదవండి: మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement