Wednesday, April 24, 2024

స్వచ్ఛ మూసీ: గోదావరితో అనుసంధానం, అయిదేళ్లలో పూర్తిగా ప్రక్షాళన: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రానున్న అయిదేళ్లలో ప్రక్షాళన పూర్తి చేసి కళ్ల ముందు స్వచ్ఛమైన మూసినదిని ఉంచుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఇందుకు ఇప్పటికే ప్రత్యేక కార్పోరేషన్‌ ఏర్పాటు చేశామని, ప్రక్షాళనకు సంబంధించిన డీపీఆర్‌ను కూడా సిద్ధం చేశామన్నారు. మూసీని ప్రక్షాళన చేయటంతోపాటు గోదావరి నదితో అనుసంధానం చేస్తామని చెప్పారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును ఓ కొలిక్కి తీసుకువస్తామన్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చే విధంగా మూసి ప్రక్షాళన ఉండనుందన్నారు. నదుల పునర్జీవం, పరిరక్షణపై హైదరాబాద్‌లోని ఇంజనీర్స్‌ భవన్‌లో జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో రెండో రోజు ఆదివారం మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాటర్‌మెన్‌ రాజేంద్రసింగ్‌ అయిదేళ్లలో మూసీ నదిని ప్రక్షాళన చేయాలని కోరారు. స్పందించిన మంత్రి హరీష్‌రావు మూసీ నదిని సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో పునజ్జీవింప చేస్తామన్నారు. మూడేళ్లలోపు స్వచ్ఛ మూసి నదీఒడ్డున వాటర్‌మెన్‌ రాజేంద్రసింగ్‌ జన్మదినాన్ని నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో వాటర్‌ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే రెండో వాటర్‌ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటు కానుందన్నారు. సీఎం కేసీఆర్‌ కృషితో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చెరువులను పునరుద్ధరించామని వెల్లడించారు. నదుల పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణపైనే సీఎం పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.

తెలంగాణలో మిషన్‌ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లామని వెల్లడించారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా నేలపై పడిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరించినట్లు వివరించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు పడినా ఎక్కడా చెరువులు తెగటం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో4వేల చెక్‌ డ్యావ్లును రూ.6 వేల కోట్లతో నిర్మించామని తెలిపారు. దాంతో భూ గర్భజలాలు పెరిగి, పడవటి నీటిద్వారా వేసవిలోనూ వాగులు, వంకలు పారుతున్నాయని చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతుల విషయంలో కేంద్రం చట్టాలను సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల కోసం దాదాపు ఏడాదిన్నరపాటు అధికారులతోపాటు తాను కూడా ఢిల్లిdలోనే మకాం వేయాల్సి వచ్చిందన్నారు. ఒక్క సీడబ్ల్యుసీలోనే 16 విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దేశంలో కొన్ని ప్రాజెక్టుల పూర్తికి దాదాపు 20 ఏళ్లు పట్టిందని.. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశామన్నారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుతో 13 జలాల్లో సాగునీరు అందుతుందని, ఈ ప్రాజెక్టుతో #హదరాబాద్‌ తాగునీరు కూడా అందిస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు సీఎం కేసీఆర్‌ ఉదయం లేవగానే సమీక్షించేవారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ, రైతు బందు, రైతు బీమా పథకాల ద్వారా వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించటంతో ఏడేళ్లలోనే ఇప్పుడు ఆ రంగం నుంచి ఆదాయం వస్తోందన్నారు.

ప్రస్తుతం తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. 2014-15లో వ్యవసాయం ద్వారా 90,820 కోట్లు సమకూరితే 2021-22లో 2, 16, 285 కోట్లు సమకూరాయని , రాష్ట్ర జీడీపీ ఆదాయం 2014-15లో 5,0 5000 కోట్లు ఉండగా … ఇప్పుడు 11, 54, 000కోట్లకు చేరిందన్నారు. తలసరి ఆదారంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, ఉత్తరప్రదేశ్‌ చివరి స్థానంలో ఉందన్నారు. మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని, ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టిdలెవల్‌ సాగునీటి ప్రాజెక్టు అని తెలిపారు.
రైతు బంధు సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ… వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. తెలంగాణ రాకముందు ఆత్మహత్యలు ఇక్కడ ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో ఒక్క రైతు ఆత్మహత్య కూడా ఉండబోదన్నారు.

రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నదులను నాశనం చేసేది మన మానవ జాతినే. మనుషుల స్వార్థం వల్లే ప్రకృతి నాశనం అవుతోందని స్పష్టం చేశారు. మూసీ నది ఒడ్డున హైదరాబాద్‌ నగరం ఉన్నా… ఇప్పుడు నది ఆనవాళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మురుగు నీరు తాగిన ఏకైక పట్టణం సూర్యాపేట పట్టణం కాగా.. సీఎం కేసీఆర్‌ అమలు చేసిన మిషన్‌ భగీరథతో కార్యక్రమంతో ఆ బాధలు పోయాయన్నారు. మల్లన్న సాగర్‌ నిర్మాణంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. తెలంగాణ వచ్చాక ప్లోరోసిస్‌ పై సీఎం కేసీఆర్‌ విజయం సాధించారని గుర్తు చేశారు. గత సంవత్సరం నుంచి ఒక్క ప్లోరోసిస్‌ కేస్‌ కూడా నమోదు కాలేదన్నారు.

వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్ర సింగ్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం దేశంలోని నదులన్నీ ఐసీయూలో ఉన్నాయని, ఐసీయూలో ఉన్న తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత బిడ్డలుగా ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. నదుల అనుసంధానం అంటే సాగునీటిని ప్రయివేటీకరించటమేనని చెప్పారు. కార్పోరేట్లు తలుచుకుంటే నదుల్లోకి కలుషిత నీటిని రాకుండా చేయగలరని అన్నారు. నదుల పరిరక్షణ కార్యక్రమాన్ని డీసెంట్రలైజేషన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. గొంతుల లేని నదులను కాపాడేందుకు గొంతుకై నిలవాలని రెండు రోజుల జాతీయ నదుల సద స్సు తీర్మాణించిందని చెప్పారు. సదస్సు ముగింపు సందర్భంగా తెలంగాణ నీటి అవార్డులను ప్రదానం చేశారు. నారాయణపేట కలెక్టర్‌ హరిచందన, కవి జయరాజ్‌, సామాజిక వేత్త దుశ్యంతుల సత్యనారాయణకు అవార్డులు వరించాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement