Saturday, April 20, 2024

Braking: కరోనా వ్యాక్సిన్ల కొనుగోలు నిలిపివేత

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొనుగోలును నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కరోనా వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో నిల్వ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సుమారు 1.8 కోట్ల వ్యాక్సిన్ డోసులు ప్రస్తుతం నిల్వ ఉన్నాయని వెల్లడించింది. ఇప్పుడు నిల్వ ఉన్న డోసులు మరో ఆరు నెలల వరకు సరిపోతాయని చెప్పింది.

అయితే ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి వ్యాక్సిన్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది. బయట మార్కెట్లోనూ కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ఈ ఏడాది వైద్యశాఖకు కేటాయించిన రూ.5 వేల కోట్లలో 4,237.14 కోట్లను తిరిగి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement