Wednesday, April 17, 2024

సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్.. చక్ర వ్యూహ్యం రివ్యూ

చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం చక్రవ్యూహం.. బేబీ అన్వి సమర్పణలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం జూన్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

కథ ఏంటంటే.. వివేక్ ( సంజయ్ ) ఊర్వశి పరదేశి ( సిరి )లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట. పెళ్లి తరువాత ఎంతో అన్యోన్యంగా, ఎంతో హ్యాపీ గా సాగుతున్న వీరి జీవితంలో ఎవరూ ఊహించని విధంగా సిరి హత్య గావించబడుతుంది. ఆ తరువాత ఈమె హత్యతో సంబందించిన వారందరూ వరుసగా హత్యకు గురవుతుంటారు. ఇలా ఎన్నో ట్విస్ట్ ల మధ్య ఆసక్తికరమైన పరిస్థితుల్లో ఎవరు ఎవరిని ఎందుకు చంపారో అర్థం కాకుండా ఉంటుంది. సస్పెన్స్ ప్రధానంగా సాగే ఈ కథలో సంజయ్ స్నేహితుడు సుదేశ్ (శరత్) పాత్రేమిటి అతను ఎందుకు హత్య గావించబడ్డాడు. అలాగే సంజయ్ దగ్గర పని చేస్తున్న మేనేజర్ మరియు సంజయ్ ను ఇష్టపడ్డ ప్రగ్య నయన్ ( శిల్ప) పాత్రేమిటి ఈ హత్యలవెనుక ఉన్న అసలు మర్మాన్ని పోలీసులు ఎలా చేదించారనేదే తెలుసుకోవాలంటే చక్ర వ్యూహ్యం సినిమా చూడాల్సిందే…

- Advertisement -

నటీ నటుల న‌ట‌న‌.. సంజయ్ పాత్రలో నటించిన వివేక్ ఇటు భర్త గా, సైకో గా తన హావ భావాలతో చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు.సిరి పాత్రలో సంజయ్ భార్య గా నటించిన ఊర్వశి పరదేశి తన పాత్రలో ఒదిగిపోయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో సత్య గా నటించిన అజయ్ నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు, తనకు సపోర్ట్ గా పోలీస్ పాత్రలో నటించిన దుర్గ (జ్ఞానేశ్వరి) కూడా చాలా చక్కగా నటించింది.హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాజ్ తిరందసు ( రవి ), కిరీటి ఇంకా ఇందులో హీరోయిన్ కు తల్లి గా నటించిన ప్రియ, తండ్రులుగా నటించిన రాజీవ్ కనకాల ( శ్రీధర్ ), శ్రీకాంత్ అయ్యాంగార్ ( శ్రీనివాస్ ), హీరోయిన్ తాతగా నటించిన శుభలేఖ సుధాకర్ ( జగన్నాధం ) పాత్రలు చిన్నవే అయినా ఉన్నంతలో ఆయా పాత్రలకు జీవం పోశారు.

టెక్నీషియ‌న్స్.. డైరెక్టర్ మధుసూధన్ కిది తొలి సినిమా అయినప్పటికీ ఆద్యంతం ప్రేక్షకులు సస్పెన్స్ కు గురయ్యేలా చక్కటి కథ, స్క్రీన్ ప్లే, తో తీసిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అనుక్షణం ప్రతి ఫ్రెమ్ లోను ఆ సస్పెన్స్ ను అలాగే కొనసాగించి దర్శకుడిగామంచి ప్రతిభను కనపరచాడు. కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. జివి అజయ్ కెమెరా పనితనం మెచ్చుకోవచ్చు. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ పనితీరు బాగుంది.భరత్ మంచిరాజు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బేబీ అన్వి సమర్పణలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి. సావిత్రి నిర్మించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయి కి తగ్గట్టు ఉండి సినిమాపై వారికున్న టేస్ట్ ను తెలిపింది. మరి ఈ చిత్రం విజయం సినిమా చూసే ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్ పై ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement