గత నెల 17న రిలీజ్ అయిన చిత్రం పుష్ప. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్. ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేఫథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఆలిండియా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమాకు క్రికెటర్లు మరింత పబ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికే మన దేశ క్రికెటర్లు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించారు. ఇటీవలే ‘శ్రీవల్లి’ సాంగ్‌కు డేవిడ్ వార్నర్ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే పాటకు టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా డ్యాన్స్ చేసి అలరించాడు.మరో ఇద్దరితో కలిసి ఆయన ఈ స్టెప్పులు వేసి పలు విషయాలు చెప్పాడు. తాను పుష్ప సినిమా చూశానని, అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడని తెలిపాడు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పాడు. శ్రీవల్లి పాటకు ఏదో ఇలా డ్యాన్స్ చేస్తున్నానని చెప్పాడు. కాగా, ఇటీవలే భారత క్రికెటర్ రవీంద్ర జడేజా మరోసారి పుష్ప రాజ్‌లా తయారై ఫొటో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పుష్ప హంగామా మామూలుగా లేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..