Thursday, March 28, 2024

వాట్సన్ మేసేజ్ ల ఆధారంగా తీర్పు చెప్పలేం: సుప్రీం..

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వాట్సప్ ఆధారంగా కోర్టులో తీర్పు చెప్పలేమని సుప్రీ కోర్టు తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో జరిగిన సంభాషణలకు విలువ లేదని సుప్రీం పేర్కొంది. ఈ రోజుల్లో వాట్సాప్ మెసేజ్‌ల‌కు ఎలాంటి ఆధారాలు లేవని.. ఏదైనా క్రియేట్ చేస్తారని..ఆ త‌ర్వాత వాటిని డిలీట్ చేస్తున్నార‌ని, అలాంటి వాట్సాప్ మెసేజ్‌ల‌కు తాము విలువ ఇవ్వ‌డం లేద‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి తెలిపారు. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో జ‌రిగిన సంభాష‌ణ‌ల‌కు సాక్ష్యం విలువ లేద‌ని, అలాంటి వాట్సాప్ మెసేజ్‌ల‌ను కోర్టులో ఆధారంగా చూప‌రాదు అని కోర్టు తెలిపింది. వ్యాపార‌వేత్త‌లు కుదుర్చుకుంటున్న ఒప్పందాల్లో ఇలాంటివి అస‌లే వీలుకాదు అని సుప్రీం చెప్పింది. చీఫ్ జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ ఏఎస్ బొప‌న్నా, హృషికేశ్ రాయ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం. మ‌రోవైపు వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీ విష‌యంలో ఆ సంస్థ‌కు, కేంద్రానికి మ‌ధ్య వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

ఇది కూడా చదవండి: సముద్రంలోకి దూసుకెళ్లిన కారు

Advertisement

తాజా వార్తలు

Advertisement