Monday, April 15, 2024

తెలుగు రాష్ట్రాలకు రూ.లక్ష జరిమానా విధించిన సుప్రీం కోర్టు

తెలుగు రాష్ట్రాలుకు సుప్రీం కోర్టు భారీ జరిమానా విధించింది. రాష్ట్రాల్లో న్యాయమూర్తులు, కోర్టు ప్రాంగణాల భద్రత కోసం తీసుకున్న చర్యలపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ సంక్షేమ నిధికి అందజేయాలని ఆదేశించింది. పది రోజుల్లోపు కౌంటర్లు దాఖలుచేయకపోతే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను పిలిపించాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లా అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య నేపథ్యంలో దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు, కోర్టుల రక్షణ కోసం సీఐఎస్‌ఎఫ్‌ తరహాలో ప్రత్యేక భద్రత బలగాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ కరుణాకర్‌ మహాళిక్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.

గత విచారణ సమయంలో కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు న్యాయమూర్తుల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్రాలకు సుప్రీం ఆదేశించింది. కానీ ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, గోవా, కేరళ, మహారాష్ట్ర, మిజోరం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేయలేదు. దీంతో ఇంతవరకూ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేయని రాష్ట్రాలపై రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః ఏపీలో కరోనా ఆంక్షల సమయం పొడిగింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement