Wednesday, April 24, 2024

బ్రిటీష్ కాలం నాటి చ‌ట్టం అవ‌స‌ర‌మా?

దేశద్రోహం కేసుల‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్రిటీష్ కాలం నాటి దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత దేశద్రోహ చట్టం అవసరమా అని ప్రశ్నించింది. దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంలో దాఖ‌లైన పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్వాతంత్య్ర పోరాటాన్ని అణిచివేసేందుకు దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని బ్రిటీష‌ర్లు వాడిన‌ట్లు కోర్టు పేర్కొంది. మ‌హాత్మా గాంధీ, బాల్ గంగాధ‌ర్ తిల‌క్ లాంటి వారిపై ఆ కేసుల‌ను పెట్టార‌ని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. దేశద్రోహ చట్టాన్ని బ్రిటన్‌ నుంచి తెచ్చుకున్న వలస చట్టంగా ధర్మాసనం పేర్కొంది. రాజద్రోహం సెక్షన్‌ 124ఏ తొలగింపునకు కేంద్రం ఆలోచించాలని సూచించింది. 75 ఏళ్ల స్వాతంత్య్రం త‌ర్వాత ఇలాంటి చ‌ట్టం అవ‌స‌ర‌మా అని కోర్టు ప్రశ్నించింది. దేశద్రోహచట్టం దుర్వినియోగం గురించి కేంద్రం ఎందుకు ఆలోచించట్లేదన్న జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం నిలదీసింది. పేకాట ఆడేవారిపైనా రాజద్రోహం కేసులు పెడుతున్నారని పేర్కొంది. బెయిల్‌ రాకుండా కక్ష సాధింపు చర్యలకు ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డింది.

ఇది కూడా చదవండి: రేవంత్ ప్లాన్ బెడిసికొట్టిందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement