Thursday, March 28, 2024

హిజాబ్ పై పిటిష‌న్ల‌ను స్వీక‌రించిన సుప్రీంకోర్టు : హోలీ త‌ర్వాత విచార‌ణ‌

ఇస్లాం మతంలో.. హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారమేమీ కాదని కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పాఠశాలల్లో హిజాబ్ ధరించవద్దంటూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలన్న నిబంధన సహేతుకమేనని.. విద్యార్థులు దీనికి అభ్యంతరం చెప్పకూడదని పేర్కొంది. అయితే, ఈ తీర్పుపై మంగళవారమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొందరు విద్యార్థినులు.


అయితే విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్​లపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. వ్యాజ్యాలపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు. త్వరలో పరీక్షలున్న నేపథ్యంలో.. సత్వరమే విచారణ జరపాలని అభ్యర్థించారు. అయితే, సీజేఐ ధర్మాసనం అందుకు నిరాకరించింది. సెలవుల తర్వాతే కేసును విచారణకు స్వీకరిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. దీనిపై తమకు కొంత సమయం కావాలని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement