Saturday, April 20, 2024

సూప‌ర్ స్టార్ కృష్ణ‌కి.. పార్ల‌మెంట్ లో నివాళి

సూప‌ర్ స్టార్ కృష్ణ‌.. దివంగ‌త న‌టుడికి పార్ల‌మెంట్ లో నివాళుల‌ర్పించారు. ఆ సమయంలో లోక్‌సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి, టీఆర్ బాలు, సుదీప్ బందోపాధ్యాయ, ఫరూక్ అబ్దుల్లా, తదితర ఎంపీలు ఉన్నారు. నేడు పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ఇటీవలి కాలంలో మరణించిన ములాయం సింగ్‌ యాదవ్‌ (సిట్టింగ్ ఎంపీ), మాజీ సభ్యులకు సంతాపం తెలిపింది.

ఈ క్రమంలోనే గత నెలలో తుదిశ్వాస విడిచిన సూపర్ స్టార్‌ కృష్ణకు లోక్‌సభ సర్మించుకుంది. స్పీకర్ ఓం బిర్లా సంతాప సందేశం చదువుతూ.. ఏలూరు నుంచి లోక్‌సభకు ఎన్నికైన కృష్ణ.. తొమ్మిదోవ లోక్‌సభలో సభ్యునిగా ఉన్నారని గుర్తుచేశారు. ఆయన సూపర్ స్టార్ గా ప్రసిద్ధి చెందారని అన్నారు. 5దశాబ్దాల కాలంలో 300కు పైగా సినిమాల్లో నటించారని చెప్పారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కంట్రిబ్యూషన్‌కు గానూ 2009లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించిందని అన్నారు. ఆయన నవంబర్ 15న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారని చెప్పారు. ములాయం సింగ్‌ యాదవ్‌తో పాటు 8 మంది మాజీ సభ్యుల మృతిపై సభ సంతాపం వ్యక్తం చేస్తుందన్నారు. దివంగత నేతలకు సంతాప సూచకంగా లోక్‌సభలో కొంతసేపు మౌనం పాటించి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement