Thursday, March 28, 2024

‘వాతి కమ్మింగ్‌’.. సన్ రైజర్స్!

తమిళ స్టార్ హీరో విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మాస్టర్‌’. ఈ చిత్రంలోని ‘వాతి కమ్మింగ్‌’ అనేపాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అనిరుధ్‌ సంగీతం అందించిన ‘వాతి కమ్మింగ్‌’ ఇటీవలే 100 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తాజాగా ఈ పాటపై సన్​రైజర్స్​ సారథి వార్నర్​తో సహ టీమ్ ఆటగాళ్లు భువనేశ్వర్​, రషీద్​ ఖాన్ చిందులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

వాతి కమింగ్​ పాటకు వార్నర్​ డ్యాన్స్​లేస్తూ కనిపించాడు. ముందు వార్నర్​ ఈ పాటకు చిందులేయగా.. తర్వాత అతనితో భువనేశ్వర్​ కుమార్, రషీద్​ ఖాన్​ జతకలిశారు. ఈ వీడియోను సన్​రైజర్స్​ హైదరాబాద్​ తమ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement