Saturday, April 20, 2024

వకీల్ సాబ్ విజయం.. రత్నప్రభ గెలుపు ఖాయం

ఏప్రిల్ 9న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా విజయం సాధిస్తుందని, అదే తరహాలో తిరుపతి ఎన్నికలోనూ బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ నేత సునీల్ దియోధర్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ మద్దతు తిరుపతి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారంతో దూసుకుపోతోంది. శనివారం బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరుపున పవన్ కల్యాణ్‌ ప్రచారం చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై తనకున్న అభిమానాన్ని ఓ రెంజ్ లో ప్రదర్శించారు సునీల్. పవన్ కల్యాణ్, మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టిన ఆయన.. 9న వకీల్ సాబ్ సినిమా విడుదల అవుతోంది, అలాగే రత్నప్రభ విజయం కూడా డిక్లేర్ అవుతుందన్నారు. వైసీపీ గూండాల పార్టీ అని.. వైసీపీ గూండాలతో గబ్బర్ సింగ్ పోరాడుతారని అన్నారు. ఎందుకంటే.. గర్బర్ సింగ్ కి కొంచం తిక్క ఉంటుంది.. దానికి కొంచం లేక్కుంటుందని అని వ్యాఖ్యానించారు. బెయిల్ పై బయట తిరిగే సీఎం జగన్ కు జైలు భయం కూడా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement