Thursday, March 28, 2024

SRH హాట్రిక్ ఓటమి..

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఎస్ ఆర్ హెచ్ వరుసగా మూడో పరాజయాన్ని నమోదు చేసింది. చెపాక్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 13 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ముంబై విధించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్‌ అయింది. అయితే ఆరంభంలో బెయిర్‌ స్టో(22 బంతుల్లో 43, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు సాధించి విజయం దిశగా నడుస్తున్నట్లు అనిపించింది. కానీ బెయిర్‌ స్టో ఔటైన తర్వాత మనీష్‌ పాండే(2) విఫలమయ్యాడు. ఆపై కాసేపటికి వార్నర్‌(36) రనౌట్‌ అ‍య్యాడు. దాంతో సన్‌రైజర్స్‌ ఒక్కసారిగా గాడి తప్పినట్లయ్యింది. విజయ్‌ శంకర్‌(28) కాసేపు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. చివర్లో వరుసగా వికెట్లు పడటంతో ఇంకా రెండు బంతులు ఉండగానే సన్‌రైజర్స్‌ ఆలౌటైంది. చివరి ఓవర్లో బౌల్ట్‌ రెండు వికెట్లు తీయడంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఆశించిన స్కోరును మాత్రం సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. చివర్లో పొలార్డ్ (22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 35 నాటౌట్) కాస్త బ్యాట్ ఝుళిపించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.తల టాస్ గెలిచి అంతకుముందు, ఓపెనర్లు క్వింటన్ డికాక్ 40, రోహిత్ శర్మ 32 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్ కు ఓ వికెట్ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement