Wednesday, April 24, 2024

సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు..

సూడాన్‌లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. ఆదేశ ప్రధాని అబ్దుల్లా సహా పలువురు అధికారులను సైన్యం గృహ నిర్భంధంలో ఉంచింది. అనంతరం ఆర్మీ జనరల్‌ అబ్దెల్‌ ఫతాహ్‌ బుర్హాన్‌ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేశారు. పాలక కూటమిలో తలెత్తిన విభేదాల వల్లే సైన్యం జోక్యం చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ప్రజాస్వామిక పాలన దిశగా సాగుతున్న ప్రక్రియను ముందుకు తీసుకుపోతానని చెప్పారు. సైన్యం తిరుగుబాటు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపు చేసేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. నిరసన జ్వాలలను అడ్డుకునే చర్యల్లో భాగంగా దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపేయించారు. సూడాన్‌లో పరిస్థితిపై అగ్రరాజ్యం అమెరికా, ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. నిర్బంధంలో ఉంచిన ప్రధానితో మిగితా వారందరినీ తక్షణమే విడుదల చేయాలని సూచించింది.

ఇది కూడా చదవండి: ఏపీలో చెత్తపై పన్ను ఎందుకో చెప్పిన ఎమ్మెల్యే రోజా

Advertisement

తాజా వార్తలు

Advertisement