Thursday, April 25, 2024

కొలువు కోసం కొట్లాడి.. ఓడిన విద్యార్థి!

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు కలత చెందుతున్నారు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో బోడ సునీల్ అనే విద్యార్థి గత శుక్రవారం(మార్చి 26) ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం మృతి చెందాడు. పోస్ట్​ మార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడి మరణవార్త తెలుసుకున్న విద్యార్థులు, బంధువులు భారీగా గాంధీ ఆసుపత్రికి తరలివచ్చారు. సునీల్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సునీల్ మృతికి సీఎం కేసీఆరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రేవంత్ విమర్శించారు.  

https://twitter.com/RevanthMithra/status/1377834417532461058

కాగా, ఐదేళ్లుగా సునీల్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు. 2016లో పోలీస్ నియామకాల్లో అర్హత సాధించిన సునీల్.. ఫిజికల్ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement