Saturday, April 20, 2024

త‌మిళ బిగ్ బాస్ కి హోస్ట్ గా స్టార్ హీరో ‘శింబు’ – ప్రోమో రిలీజ్

బిగ్ బాస్ ప‌లు భాష‌ల్లో ప్ర‌సార‌మ‌వుతూ అక్క‌డి ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటోంది. కాగా త‌మిళ బిగ్ బాస్ షోకి విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్ నుండి త‌ప్పుకున్నారు. మ‌రి ఆయ‌న స్థానంలో ఎవ‌రు వ‌స్తార‌నేదానిపై స‌స్పెన్స్ వీడింది. క‌మ‌ల్ స్థానంలో త‌మిళ స్టార్ హీరో శింబు హోస్ట్ చేయ‌నున్నాడు. ఈ మేర‌కు ప్రోమో కూడా విడుద‌ల చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమిళ్ ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసింది. ఇక పై స్టార్ హీరో శింబు తమిళ్ బిగ్‏బాస్ షో హోస్ట్‏గా వ్యవహరించనున్నట్లు ఆ వీడియో ద్వారా స్పష్టం చేశారు నిర్వాహకులు. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్ అన్ని ఇప్పుడు పూర్తిగా ఓపెన్ కావడంతో.. అటు సినిమా షూటింగ్స్ కు .. ఇటు బిగ్ బాస్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించడం వీలు కాకపోవడంతో షో నుంచి తప్పుకుంటున్నట్లుగా కమల్ ప్రకటించారు. ఇక ఇప్పుడు కమల్ స్థానంలో స్టార్ హీరో శింబు ప్రేక్షకులను అలరించనున్నారు.

https://twitter.com/disneyplusHSTam/status/1496736760197312519
Advertisement

తాజా వార్తలు

Advertisement