Friday, April 19, 2024

బలమైన శరీరం, బలమైన మనస్సు అంటోన్న స‌మంత‌

నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత త‌న దూకుడిని పెంచింది హీరోయిన్ స‌మంత‌. ఇక ఈమె ఫిట్ నెస్ కి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అంద‌రికీ తెలిసిందే. కాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో హెవీవెయిట్‌లను అమాంతంగా ఎత్తేస్తోంది. ఈ వీడియోతో పాటు బలమైన శరీరం, బలమైన మనస్సు అంటూనే 2022-23 తనకు శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న సమయం అని సమంత పోస్ట్ చేసింది. సామ్ తన తన ట్రైనర్ జునైద్ పర్యవేక్షణలో హెవీ వెయిట్‌లను ఈజీగా ఎత్తేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక సామ్ ప్రస్తుతం “శాకుంతలం”, “యశోద” అనే రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. మరోవైపు రాజ్ అండ్ డికెతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బాలీవుడ్ చిత్రంలో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో ఓ మూవీ, అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే మరో హాలీవుడ్ మూవీకి కూడా సైన్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement