Wednesday, April 24, 2024

Story : బ్రెస్ట్ లిప్ట్స్, బ్రెస్ట్ తగ్గింపు సర్జరీలకు డిమాండ్

బ్రెస్ట్ లిప్ట్స్.. బ్రెస్ట్ త‌గ్గింపు స‌ర్జ‌రీల‌కు డిమాండ్ పెరిగింది. 2021లో ఇలా 15,000 మంది తమ వక్షోజాల నుంచి కొవ్వు, గ్రాండ్యుయల్ టిష్యూను తొలగించే శస్త్ర చికిత్సలు చేయించుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కానీ, అదే ఏడాది ఇంప్లాంట్లతో బ్రెస్ట్ సైజును పెంచుకున్న వారి సంఖ్య దీనికి రెట్టింపు స్థాయిలో 31,608గా ఉండడం గమనించొచ్చు. ఇక 2021లోనే 11,520 మంది మహిళలు బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఇది కూడా ఒక ప్లాస్టిక్ సర్జరీయే. వక్షోజాల్లోని టిష్యూలను గట్టి పరుస్తారు. దీనివల్ల సాగిపోయి, పెద్ద పరిమాణంలో కాకుండా చిన్న సైజులో కనిపిస్తాయి. గడిచిన మూడేళ్ల కాలంలో బ్రెస్ట్ లిప్ట్స్, బ్రెస్ట్ తగ్గింపు సర్జరీలకు డిమాండ్ పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో బ్రెస్ట్ లిఫ్ట్, బ్రెస్ట్ తగ్గింపు సర్జరీలు చేసినట్టు ముంబైలోని నానావతి హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దేవయాని బర్వే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో పంచుకున్నారు.

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్ లో సగటు వక్షోజాల పరిమాణం పెద్దగా ఉంటోంది. పైగా మన దగ్గర సాగిపోయే గుణం ఎక్కువ. దీంతో మహిళల్లో నలుగురిలోకి వెళ్లేందుకు ఆత్మన్యూనతకు గురి అవుతున్నారు. తమ విశ్వాసాన్ని పెంచుకునేందుకు వారు ఈ సర్జరీలకు యుక్త వయసులోనే ముందుకు వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. పెద్ద పరిమాణంతో, సాగిపోవడం వల్ల మహిళలు బ్రాని బిగుతుగా లాగి ధరించాల్సి వస్తుంది. అది నొప్పికి, చర్మంపై నల్లటి చారలకు, అల్సర్లకు కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. తమ శరీర రూపానికి తగట్టు తమ వక్షోజాలు ఉండాలని కోరుకునే వారు, అందానికి ప్రాధాన్యం ఇచ్చే వారు పెరుగుతుండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement