Thursday, April 25, 2024

లాభాల‌తో ప్రారంభ‌మ‌యిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.. ఉదయం 10.00 గంటల సమయంలో సెన్సెక్స్ 183 పాయింట్ల లాభంతో 57814 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ కూడా 52 పాయింట్లు లాభపడి 17040 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.54 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ సూచీల్లోని నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌లండ్‌టీ, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే.. పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా మాత్రం నష్టాలను చవిచూస్తున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగ సంక్షోభాన్ని నివారించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. ఇక అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ నేడు సమావేశం కానుంది. వడ్డీ రేట్ల పెంపుపై చర్చించనుంది. ఇందుకు సంబంధించి బుధవారం తుది నిర్ణయం వెలువడుతుంది. వడ్డీ రేట్లు పెరిగిన పక్షంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు కూడా పుంజుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement