Tuesday, April 23, 2024

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

నేటి స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 85పాయింట్లు లాభ‌ప‌డింది. దాంతో 61,235కి చేరుకోగా , నిఫ్టీ 45పాయింట్లు పెరిగి 18,258వ‌ద్ద స్థిర‌ప‌డింది, ఇక ఐటీ, మెట‌ల్ స్టాకులు లాభాల‌ను ముందు ఉండి న‌డిపించాయి. నేటి ట్రేడింగ్ లో 1,630 షేర్లు అడ్వాన్స్ కాగా…. 1,609 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 62 షేర్లు ఎలాంటి మార్పుకు గురి కాలేదు. టాటా స్టీల్(6.35%), సన్ ఫార్మా (3.54%), ఎల్ అండ్ టీ (2.64%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.54%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.49%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. విప్రో (-5.98%), ఏసియన్ పెయింట్స్ (-2.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.77%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.60%) టాప్ లూజర్స్ గా మిగిలింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement