Tuesday, March 26, 2024

మ‌సీదులో హిందూ దేవ‌త‌ల విగ్ర‌హాలు.. హైకోర్టు ఆర్డర్​తో సర్వే, వీడియో చిత్రీకరణ

హిందువులకు అత్యంత పవిత్రమైన వారణాసిలోని కాశీ విశ్వేశ్వరాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో శనివారం కూడా కోర్టు నియమించిన అధికారుల బృందం సర్వేను నిర్వహించింది. వీడియోలను చిత్రీకరించింది. ఈ సర్వేలో న్యాయవాదులు కూుడా పాల్గొన్నారు. మసీదు వెనుక హిందూ ఆలయం ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని సర్వేచేయించాలని పిటిషనర్లు కోరినమీదట స్థానిక కోర్టు ఇందుకు అనుమతిమంజూరు చేసింది.ఈ మసీదు వెనక భాగంలో సర్వే జరిపించాలని ఐదుగురు మహిళలు గత ఏడాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మసీదు పశ్చిమంలో ఉన్నగోడను ఆనుకుని మా శింగార్‌ గౌరీ ఆలయం స్థలం ఉందనీ, ఆ స్థలంలో ఏడాదికి ఓసారి పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చేవారనీ వారు ఆ పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

కాగా, ఏడాది పొడవునా పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు సర్వే చేసేందుకు అనుమ‌తి ఇచ్చింఇ. ఈ సందర్భంగా ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఈ మసీదు స్థలంలో సర్వే జరుపుకోవడానికి తమకు అభ్యంతరం లేదనీ, కానీ, వీడియోతీయడానికి వీల్లేదని జ్ఞానవాపి కేర్‌టేకర్‌ కమిటీ స్పష్టం చేసింది. ఈ మసీదులో సర్వే నిర్వహించాలన్నఅభ్యర్ధనపై ఏడాదిపైగా వివాదం సాగుతోంది. గత మార్చిలో మసీదు ఖాళీ స్థలంలో సర్వే నిర్వహించరాదని కోరుతూ మసీదు కేర్‌టేకర్‌ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు తోసిపుచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement