Tuesday, April 23, 2024

Good News: అప‌హ‌ర‌ణ‌కు గురైన‌ మేకత‌ల యోగిని విగ్ర‌హం.. మ‌ళ్లీ భార‌త్‌కు వ‌స్తోంది..

మేక‌త‌ల యోగిని విగ్ర‌హం దేశంలో ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. అప్ప‌ట్లో యోగినుల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉండేది. యోగినులు తాంత్రిక పూజా విధానంతో సంబంధం క‌లిగి ఉన్న శ‌క్తివంత‌మైన దేవ‌త‌లుగా న‌మ్ముతారు. ఈ దేవ‌త‌లు అనంత‌మైన శ‌క్తుల‌ను క‌లిగి ఉంటార‌ని ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో న‌మ్మ‌కం ఉంది.

అయితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బండాలోని లోఖారీ ప్రాంతంలో ఉన్న‌ ఆలయం నుండి మేక‌త‌ల యోగిన విగ్ర‌హాన్ని అక్రమంగా త‌ర‌లించారు. కాగా, ఇది 10వ శతాబ్దానికి చెందిన విగ్ర‌హంగా ఆర్కియాల‌జీ డిపార్ట్ మెంట్ వారు చెబుతున్నారు. అయితే అప్ప‌ట్లో అక్ర‌మంగా తీసుకెళ్లిన ఈ మేకతల యోగిని రాతి విగ్రహాన్ని మ‌ళ్లీ భారతదేశానికి తిరిగి ఇస్తున్నట్లు సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మ‌ధ్య‌నే ప్రకటించారు.

మేక‌త‌ల యోగిని 10 శ‌తాబ్దానికి చెందిన రాతి విగ్రహం. ఇసుక, రాయితో చేసిన విగ్ర‌హాలాలో దీనికి ప్ర‌త్యేక విశిష్ట‌త ఉంది. దీన్ని లోఖారీ ఆలయంలో ప్రతిష్టించారు. అయితే 1988లో లండ‌న్‌లోని ఆర్ట్ మార్కెట్‌లో ఒక‌సారి ఈ శిల్పం క‌నిపించింద‌ని, మ‌ళ్లీ తాజాగా 2021 అక్టోబ‌ర్‌లో లండ‌న్‌లో క‌నిపించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ విగ్ర‌హాన్ని ఆర్కియ‌లాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియాకు అప్ప‌గించ‌బోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement