Tuesday, March 26, 2024

India| ప్రత్యేక పూజతో మొదలై.. పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ షెడ్యూల్ ఇదే

భారత పార్లమెంట్​ నూతన భవనం ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. ఎల్లుండి అంటే 28వ తేదీన కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. నూతన పార్లమెంట్​ను జాతికి అంకితం చేసే ప్రోగ్రామ్​ని రెండు దశలుగా నిర్వహించనున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఎల్లుండి (28వ తేదీ ఆదివారం) తెల్లవారు జామునే పాత పార్లమెంట్​ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు పూజలు చేయనున్నారు. ఈ క్రతువులో ప్రధాని మోదీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​ హరివంశ్​తో పాటు పలువురు సీనియర్​ మంత్రులు పాల్గొంటారు. పూజ తర్వాత వీరంతా లోక్​సభ, రాజ్యసభ చాంబర్లను సందర్శిస్తారు.

ఇక.. లోక్​సభ స్పీకర్​ కుర్చీకి కుడిపక్కన పెట్టే సెంగోల్​ (రాజదండం)ని ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్​ రూపకర్తలు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అనంతరం కొత్త పార్లమెంట్​ బిల్డింగ్​ ఆవరణలో పూజలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 9.30 లోపే పూర్తి చేయనున్నారు..

కాగా, ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో జాతీయ గీతాలాపనతో రెండో దశ ప్రారంభ వేడుకలు షురూ కానున్నాయి. లోక్​సభ చాంబర్​లో జరిగే ఈ ప్రోగ్రామ్​కి ప్రధాని మోదీతోపాటు అతిథులు పాల్గొననున్నారు. తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​ ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. ఇక.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​ ప్రసంగం ఉండబోతోంది. తర్వాత పార్లమెంట్​ నిర్మాణ సమయంలో అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

అయితే.. ఈ ప్రోగ్రామ్​ని దేశంలోని 19 పార్టీలు బహిష్కరించాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు ఆహానం పంపారు. అయినా కొత్త పార్లమెంట్​ను రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు.

సెంగోల్​పై మాటల యుద్ధం

చారిత్రక నేపథ్యం కలిగిన సెంగోల్​ (రాజదండం)ని రాజ్యసభలో ప్రతిష్ఠించడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బ్రిటిషర్ల నుంచి భారత్​కు అధికార మార్పిడికి గుర్తుగా రాజదండం అందించారని చెప్పడానికి రుజువుగా ఎలాంటి దస్త్రాలు లేవని కాంగ్రెస్​ పార్టీ అంటోంది. అధికార మార్పిడికి సెంగోల్​ గుర్తు అని లార్డ్​ మౌంట్​ బాటన్​ కానీ, అప్పటి ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూ కానీ, రాజగోపాలచారి కానీ చెప్పినట్టు ఎక్కడా ఆధారాలు లేవని కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరాం రమేశ్​ చెప్పారు. అయితే.. దీన్ని బీజేపీ నేతలు తిప్పికొట్టారు. అదంతా తప్పుడు వాదనలి కొట్టిపారేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement