Thursday, April 18, 2024

స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌కి – ‘నాట్ హెల్త్ సీఎస్ ఆర్’ అవార్డ్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య‌, అపోలో హాస్పట‌ల్ వ్య‌వ‌స్థాప‌కులు ప్ర‌తాప్ సి.రెడ్డి మ‌న‌వ‌రాలు ఉపాస‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌క నాట్ హెల్త్ సీఎస్ ఆర్ అవార్డు ద‌క్కింది. అపోలో హాస్పిట‌ల్స్ కేంద్రంగా త‌న వంతుగా కొన్ని ప్రాజెక్టుల‌పై ప‌నిచేస్తున్న ఉపాస‌న సంపూర్ణ ఆరోగ్యం పేరిట ప్ర‌యోగాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అపోలో ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న ఉపాస‌న‌.. సంపూర్ణ ఆరోగ్యం ప‌ట్ల అవగాహ‌న క‌ల్పిస్తూ ప‌లు వీడియోల‌ను కూడా విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఉపాస‌న రూపొందించిన ఓ ప్రాజెక్టును ప‌రిశీలించిన నాట్‌హెల్త్ సీఎస్ఆర్ ఆమెకు 2022కు సంబంధించిన అవార్డును ప్ర‌క‌టించింది. ఈ అవార్డును ఇటీవ‌లే అందుకున్న ఉసాస‌న ఉబ్బిత‌బ్బిబ్బైపోయారు. ఈ అవార్డుతో త‌మ తాత ప్ర‌తాప్ సి.రెడ్డి చెప్పే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే దిశ‌గా ప‌య‌నిస్తున్నామ‌న్న భావ‌న క‌లుగుతోంద‌ని ఉపాస‌న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement