Saturday, April 20, 2024

స్టార్ హీరో ధ‌నుశ్ త‌న‌యుడిని చూశారా

త‌మిళ స్టార్ హీరో ధ‌నుశ్ కుమారుడిని చూశారా. అచ్చు ధ‌నుశ్ లాగే ఉన్నాడు ఈ అబ్బాయి. ధ‌నుశ్ పోస్ట్ చేసిన ఫొటోని చూస్తే ..అదేంటి ఫొటోలో క‌నిపిస్తున్న ఇద్ద‌రిలో ఇంత‌కీ ధ‌నుష్ ఎవ‌రని తిక‌మ‌క ప‌డుతున్నారా.. ఆ స్టిల్‌ను తీక్ష‌ణంగా గ‌మ‌నిస్తే ధ‌నుష్ ఎవ‌రో తెలుస్తోంది. మ‌రి అందులో ఉన్న మ‌రో వ్య‌క్తి ఎవ‌రో తెలుసా.. జూనియ‌ర్ ధ‌నుష్‌. అదేనండి ధ‌నుష్ కుమారుడు యాత్ర. ప్ర‌స్తుతం నానే వ‌రువెన్ (Naane Varuven) సినిమా చిత్రీక‌ర‌ణ నిమిత్తం ఊటీలో ఉన్నాడు ధ‌నుష్‌. షూటింగ్ బ్రేక్‌లో యాత్ర‌తో క‌లిసి క్వాలిటీ స‌మ‌యాన్ని గ‌డిపాడు ధ‌నుష్‌. కొడుకు యాత్ర హెయిర్‌ను సెట్ చేస్తున్న‌ట్టు స్టిల్‌లో చూడొచ్చు. ధ‌నుష్‌కు యాత్ర కార్బ‌న్ కాపీలా ఉన్నాడంటూ నెటిజ‌న్లు తెగ చ‌ర్చించుకుంటున్నారు. డ్యుయ‌ల్ రోల్‌లో న‌టిస్తున్న ఈ సినిమా కోసం ధ‌నుష్ విలువిద్య పాఠాలు నేర్చుకుంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement