Friday, April 26, 2024

అజిత్ కి విల‌న్ గా – విజ‌య్ సేతుప‌తి !

స్టార్ హీరో అజిత్ కి విల‌న్ గా మ‌రోస్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్నారు. స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివ‌న్‌, అజిత్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించ‌డానికి మేక‌ర్స్ విజ‌య్‌ను సంప్రదించార‌ట‌. పాత్ర న‌చ్చ‌డంతో విజ‌య్ వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన ‘క‌ణ్మ‌ణి రాంబో ఖ‌తిజా’ తాజాగా విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement