Friday, March 29, 2024

స్థిరంగా బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.47,550 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.51,870గా నమోదైంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడలో కూడా ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,550గా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉన్నాయి.

ఇదే సమయంలో ఈ బులియన్ మార్కెట్లలో వెండి ధరలు కూడా బంగారంతో పాటు స్థిరంగా కొనసాగుతున్నాయి. అలాగే 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర రూ.52,030 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో సిల్వర్ రేటు కేజీ రూ.57,400 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో వెండి రేట్లు కేజీ రూ.63 వేల వద్ద పలుకుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్లకు చెందినది రూ.47,700గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement