Thursday, May 26, 2022

TS: విద్యార్థులకు అలర్ట్: నేటి నుంచి పదో తరగతి హాల్ టికెట్లు

తెలంగాణలో ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను WWW.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షల్లో మొత్తం 5,08,275 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నేటి నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్‌సీ బోర్డు తెలిపింది. మే 23 నుంచి ప్రారంభం అయ్యే పరీక్షలు జూన్ 1 వరకు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. అలాగే, ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల నుంచి కూడా హాల్‌ టికెట్లను తీసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement