Thursday, March 28, 2024

ఏపీలో పది పరీక్షలు యధాతథం

ఏపీలో పదో తరగతి పరీక్షలు యధాతథంగా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పదో తరగతి విద్యార్థులకు మే1 నుండి మే31 వరకు సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 7 నుండి జరిగే పదవ తరగతి పరీక్షలు యధాతధం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో కరోనా నిర్దారణ పరీక్షలలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో కరోనా కట్టడితో పాటు జాగ్రత్తలు తీసుకోవడంలో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కరోనా వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్, నాన్ ఆక్సిజన్ బెడ్లను, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ లో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే ఇప్పటికే జరిమానా విధించామన్నారు. తీరు మారకుంటే ఆసుపత్రి లైన్సెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement