Monday, May 29, 2023

ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు.. కేటీఆర్

తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి కి గుర్తుగా ఎల్బీనగర్ చౌరస్తాకు అతడిపేరు పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్ లో కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్, ఎయిర్ పోర్టుకు మెట్రో సౌకర్యం కల్పిస్తామన్నారు. మెట్రోను హయత్ నగర్ వరకు విస్తరిస్తామన్నారు. ఇప్పటి వరకు అన్ని ఫ్లై ఓవర్లు పూర్తయ్యాయన్నారు. సెప్టెంబర్ లో మూడు ఫ్లైఓవర్లు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement