Thursday, April 18, 2024

Bigg Boss 5: తొలి ఫైనలిస్ట్ గా శ్రీరామ్

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సిజన్ 5 తుది దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ షో పూర్తి కానుంది. సిజన్ 5 తొలి ఫైనలిస్ట్ గా శ్రీరామ్ నిలాచారు. టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. బోర్డ్‌పై స్విచ్ఛ్‌లు బల్బ్‌లు ఇచ్చి బజర్ మోగేసరికి ఐదైదు చొప్పున బల్బ్స్ వెలిగించాలని.. తక్కువ టైంలో ఎక్కువ బల్బ్‌లు వెలిగించిన వాళ్లే ఈ టాస్క్‌లో విజేతలుగా నిలుస్తారని చెప్పారు. అయితే శ్రీరామ్, సిరిలు కాళ్లకి కట్లు కట్టుకుని ఉండటంతో ఇద్దరి తరపున షణ్ను టాస్క్ ఆడాడు.

మొత్తంగా ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి మానస్ 29 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. 28 పాయింట్లతో శ్రీరామ్ రెండో స్థానం.. 24 పాయింట్లతో సిరి మూడో స్థానం.. 23 పాయింట్లతో సన్నీ నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో సన్నీ, సిరి టికెట్ టు ఫినాలే పోటీ నుంచి తప్పుకున్నారు. తొలి ఫైనలిస్ట్ గా నిలిచేందుకు చివరి ఛాలెంజ్ మానస్-శ్రీరామ్‌ల మధ్య జరిగింది. స్టాండ్ పై ఉన్న బ్యాగ్ ని ఫస్ట్ ఎవరు కిందకు తీసుకొస్తారో వారే విజేతగా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు. ఈ ఆటలో శ్రీరామ్‌ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. శ్రీరామ్‌కు ఇంటి సభ్యులు అందరు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement