Saturday, April 20, 2024

Breaking: శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే రాజీనామా ఆమోదం

శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే రాజీనామాకు ఆమోదం లభించింది. ప్రధాని రాజీనామాను శ్రీలంక అధ్యక్షుడు గొటబయ ఆమోదించారు. అధ్యక్ష సచివాలయం నుంచి గెజిట్ విడుదలైంది. అత్యవసరంగా పార్లమెంట్ ను సమావేశ పరచాలని విపక్షాలు అంటున్నాయి. మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని మైత్రిపాల సిరిసేనను అధ్యక్షుడు గొటబయ కోరారు. విపక్షాలతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్ష నేత సజిత్ నిరాకరించారు. పార్లమెంట్ సమావేశంపై స్పీకర్ తో గొటబయ చర్చలు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement