Thursday, April 18, 2024

Sports: ఇండోనేషియా ఓపెన్.. సెమీస్ కు చేరిన సింధు

బాలి: ఇండోనేషియా ఓపెన్ సూప‌ర్ 1000 టోర్నీలో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ సింధు దూకుడు కొన‌సాగుతోంది. శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సింధు ద‌క్షిణ కొరియా ష‌ట్ల‌ర్ సిమ్ యుజిన్ పై విజ‌యం సాధించి సెమీఫైన‌ల్ కు చేరుకుంది. క్వార్ట‌ర్స్ లో జ‌రిగిన హోరాహోరీలో సింధు ప్ర‌త్య‌ర్థి సిమ్ యుజిన్ పై 14-21, 21-19, 21-14 తేడాతో గెలుపొందింది.

తొలి సెట్‌ను గెలుచుకున్న యుజిన్ అనంత‌రం సింధు దూకుడు ముందు నిల‌వ‌లేక‌పోయింది. చివ‌రి రెండు సెట్ల‌ను వ‌రుస‌గా గెలుచుకున్న సింధు సెమీస్ కు చేరుకుంది. సెమీస్ పోరులో సింధు జ‌పాన్ కు చెందిన త‌క‌హ‌షి లేదా థాయ్ లాండ్ కు చెందిన ర‌చ‌నోక్ ఇంత‌నోన్ తో త‌ల‌ప‌డ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement