Thursday, December 1, 2022

Breaking: ఆటో బ్లాస్ట్ కేసులో దర్యాప్తు వేగవంతం

మంగళూరు ఆటో బ్లాస్ట్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఈ పేలుడును ఉగ్రవాదుల కుట్రగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించారు. రెండు బ్యాటరీలు, నట్లు, బోల్ట్, సర్క్యూట్ వైరింగ్ ను క్లూస్ టీం గుర్తించింది. కుక్కర్ లో బాంబు అమర్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో ఓ ప్రయాణికుడు ఎక్కిన తర్వాతే పేలుడు సంభవించింది. దీంతో ప్రయాణికుడిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే గాయపడిన ప్రయాణికులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. భారీగా పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలుస్తోందని ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలో విచారణ జరుపుతున్నామన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement