Thursday, April 25, 2024

యాదాద్రి ప్ర‌ధానాల‌యంలో సీఎం కేసీఆర్ దంప‌తుల ప్ర‌త్యేక పూజ‌లు

యాదాద్రి ప్ర‌ధానాల‌యంలో సీఎం కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. కాసేప‌ట్లో మహా కుంభాభిషేకంలో పాల్గొననున్నారు. ఆలయ ఉద్ఘాటనకు స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించ‌నున్నారు. ఈ రోజు ఉద‌య‌మే శివాలయ యాగ శాలలో ద్వారతోరణం, శత రుద్రాభిషేకం, మహారుద్ర పురశ్చరణ, మూలమంత్రానుష్ఠానం, వేద హవనం నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు రుద్ర హవనం, ప్రాసాద స్నపనం, కూర్మశిల, బ్రహ్మశిల, పిండికా స్థాపనం నిర్వ‌హిస్తారు. తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ ఉద్ఘాటన కార్యక్రమం జ‌రుగుతోంది.యాదాద్రి అభివృద్ధిలో భాగంగా పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement