Thursday, March 28, 2024

క‌ళాత‌ప‌స్వి ‘విశ్వ‌నాథ్’ కి పుట్టిన‌రోజు విషెష్ తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్

ద‌ర్శ‌కుడు, న‌టుడు,నిర్మాత క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్.
కళాతపస్వి విశ్వనాథ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని కలిగిన దర్శకులు కె.విశ్వనాథ్ అని కొనియాడారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వయంకృషి, స్వాతిముత్యం… ఇలా ఆయన ఎన్నో ఆణిముత్యాల వంటి చిత్రాలను తెలుగు చిత్రసీమకు అందించారని కీర్తించారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళలు, తెలుగు భాషను వెండితెరపై ఆయన ఆవిష్కరించిన విధానం నవతరానికి స్ఫూర్తిదాయకం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశ్వనాథ్ గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement