Thursday, April 25, 2024

దక్షిణ కొరియాలో కరోనా విలయం… ఒక్కరోజే 6 లక్షల కేసులు

దక్షిణ కొరియాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గత నెల రోజులుగా అక్కడ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. సౌత్ కొరియాలోకి మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి అని కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ (కేడీసీఏ) వెల్లడించింది. దేశంలో 6.21 లక్షల పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయని.. గురువారం ఒక్కరోజే వైరస్ బారిన పడి 429 మంది మృతి చెందారని కేడీసీఏ తెలిపింది. కొరియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.25 లక్షలకు చేరుకుందని పేర్కొంది. కేసుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement