Tuesday, April 23, 2024

అరేయ్‌.. మీ టీవీ పగలగొట్టకు..మళ్లీ నన్నే అడుగుతారు: సోనూసూద్..

సోనూసూద్ కరోనా విపత్కర సమయంలో ఎంతమందికి ఆదుకున్నాడో దేశం మొత్తం తెలుసు.. సినిమాల్లో విలన్ వేషాలు వేసిన.. నిజజీవితంలో హీరోలా జీవిస్తున్నాడు సోనూసూద్..అలాంటి సోనూసూద్ ని ఇప్పుడు దేశవ్యాప్తంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ అభిమానిస్తున్నారు. అయితే సోనూసూద్ ఇంతవరకు నటించిన సినిమాల్లో హీరోల చేతుల్లో దెబ్బలు తినడం మాత్రం ఇప్పుడు ఎవ్వరికి నచ్చడం లేదు…తాజాగా తన అభిమాన హీరో సోనూసూద్‌ను సినిమాలో కొట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ బుడతడు టీవీని పగుల గొట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో చోటు చేసుకుంది. టీవి పగలగొట్టిన బుడతడి పేరు విరాట్.. ఈ బుడతడు ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నాడు.

ఇంట్లో మరదలు అద్విన్‌తో కలిసి టీవీలో దూకుడు సినిమా చూస్తున్నాడు విరాట్. ఈ క్రమంలో హీరో మహేశ్‌బాబుకు విలన్‌ సోనూసూద్‌ మధ్య ఫైటింగ్‌ సీన్‌ జరుగుతుంది. సోనూసూద్‌ను కొట్టడాన్ని చూసిన బుడతడు విరాట్‌కు కోపం వచ్చింది. కరోనా టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్‌ అంకుల్‌ని కొడతావా అంటూ బయటకు వెళ్లి ఓ రాయిని తెచ్చి టీవీపై కోపంతో కొట్టాడు. దీంతో టీవీ పగిలిపోయింది. కుటుంబ సభ్యులు టీవీని ఎందుకు పగుల గొట్టావురా అంటూ విరాట్‌ను నిలదీశారు. అందరికీ సాయం చేస్తున్న సోనూసూద్‌ అంకుల్‌ను వేరే వాళ్లు కొడుతుంటే కోపం వచ్చి రాయితో కొట్టాను అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఈ విషయం కాస్తా అందరికి తెలియడంతో వైరల్‌గా మారింది. విరాట్‌ టీవీ పగలగొట్టిన ఘటన చివరికి సోనూసూద్‌ను చేరడంతో ట్విటర్‌లో స్పందించాడు. ‘అరేయ్‌.. మీ టీవీ పగలగొట్టకు.. మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు’ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఇది కూడా చదవండి: రామ్ లింగుస్వామి సెట్ లో డైరెక్టర్ శంకర్

Advertisement

తాజా వార్తలు

Advertisement