Sunday, November 28, 2021

సోనూసూద్ ఇంటిపై ఐటీ రైడ్స్..

క‌రోనా స‌మ‌యంలో పేద‌ల పాలిట దేవుడిగా మారిన సోనుసూద్‌కు ఇండ్లపై ఇన్ కమ్ టాక్స్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ముంబై, లోక్నోతో పాటు దేశవ్యాప్తంగా ఆరు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు చేస్తోంది. ఆయనకు చెందిన ఆఫీసులో కూడా తనిఖీలు చేసినట్టు సమాచారం. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ స‌మ‌యంలో ఐటీ రైడ్స్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి  (BJP) వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోనూ సూద్‌కు సంబంధించిన ఆరు నివాసాల్లో ఐటీ అధికారులు ‘సర్వే’ చేశారనే వార్త సంచలనంగా మారింది.

కరోనా కాలంలో గత సంవత్సరం లాక్‌డౌన్‌ కారణంగా దేశ‌, విదేశాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా విమానాలు, బస్సులు ఏర్పాటు చేసి సొంత గ్రామాలకు త‌ర‌లించారు. ఆప‌ద‌లో ఎవ‌రు పిలిచినా ప‌లికారు. స‌హాయం చేశారు. దీంతో అసలు సోనూ సూద్ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే అంశంపై చాలా మందికి అనుమానాలు వచ్చాయి. సినిమాల్లో నటించే సోనూ సూద్ దగ్గర ఇంత డబ్బులు ఉండడం కష్టం. కానీ, అంత మందికి సాయం చేస్తున్నాడంటే కచ్చితంగా డబ్బులు సాయం చేస్తుంటారని భావించారు. ఈ క్రమంలో ఐటీ శాఖ ‘సర్వే’ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా సోనూసుద్ ఇంటి పై ఐటీ రైడ్స్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ట్రూ సోల్జ‌ర్ కు పెద్ద బుద్దే చెబుతున్నారు అంటూ సోష‌ల్ మీడియా ఫైర్ అవుతుంది.

ఇది కూడా చదవండి: Drugs case: ముగిసిన ముమైత్‌ ఖాన్‌ ఈడీ విచారణ..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News