Friday, May 27, 2022

నెల్లూరు వ‌ర‌ద బాధితుల‌కు .. సోనూసూద్ కిట్లు ..

ఇప్ప‌టికే ఎంతోమందికి సాయ‌మందించి దేవుడిగా మారాడు రియ‌ల్ హీరో సోనూసూద్.. మ‌రోసారి ఆయ‌న ఆప‌న్న హ‌స్తం అందించారు. నెల్లూరు జిల్లాలో వ‌ర‌ద బాధితుల క‌ష్టాలు చూసి చ‌లించారు. సోనూ సూద్ ఛారిటీ ఫౌండేష‌న్ త‌ర‌పున రెండు వేల బాధిత కుటుంబాల‌కు కిట్ల‌ని పంపిణీ చేశారు. ఈ కిట్‌లో బకెట్, మగ్గు, చాప, దుప్పట్లు నిత్యవసర సరుకులు ఉన్నాయి. నేటి నుండి బాధిత కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేసేందుకు సోనుసూద్ ఫౌండషన్ వాలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement