Friday, April 19, 2024

సోసూసూద్ కి నోటీసులు .. ఆ భ‌వ‌నాన్ని రెసిడెన్షియ‌ల్ గా మార్చ‌మంటూ ఆదేశాలు ..

న‌టుడు సోనూసూద్ కి బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నోటీసులు జారీ చేసింది. వ‌స‌తి గృహం కోసం నిర్మించిన ఆరు అంత‌స్తుల బిల్డింగ్ ని హోట‌ల్ గా మార్చార‌ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నోటీసులు జారీ చేసి సోనూసూద్ కి షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశం మేర‌కు అక్ర‌మంగా హోట‌ల్ గా మార్చిన ఆరు అంత‌స్తుల భ‌వ‌నాన్ని.. తిరిగి రెసిడెన్షియ‌ల్ భ‌వంతి గా మార్చుతాన‌ని గ‌తంలో సోనూసూద్ మాట ఇచ్చార‌ని.. దానిని ఇంకా నిల‌బెట్టుకోలేదంటూ.. బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నోటీసులు పంపింది. దీనిపై వెంట‌నే స్పందించి.. బిల్డింగ్ ను కొన‌సాగించాల‌ని సోనూసూద్ కు వార్నింగ్ ఇచ్చింది. మ‌రి సోసూసూద్ ఏం చేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement