Wednesday, April 24, 2024

ఎన్టీఆర్ చిత్రంలో సోనాలీబింద్రే – ఏ క్యారెక్ట‌రో తెలుసా

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ – విజ‌న‌రీ కెప్టెన్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం తెర‌కెక్క‌నుంది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇందులో తార‌క్ ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తార‌క్ – కొర‌టాల సెకండ్ జాయింట్ వెంచ‌ర్ లో అందాల తార సోనాలి బింద్రే ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ కి అక్క‌గా అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర‌లో సోనాలి క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. మురారి , ఇంద్ర , ఖ‌డ్గం , మ‌న్మ‌థుడు, ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు , శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ వంటి తెలుగు చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించింది సోనాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement