Tuesday, November 28, 2023

సోమ్ నాథ్ ఆలయంలో.. ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

సోమ్ నాథ్ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు ప్రధాని నరేంద్రమోడీ. గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ప్రధాని రాష్ట్రానికి వచ్చారు. కాగా ఆదివారం సౌరాష్ట్ర రీజియన్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.సోమ్ నాథ్ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత వెరావల్ పట్టణంలో నిర్వహించే ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొంటారు. ఈ ర్యాలీ తర్వాత మోడీ రాజ్ కోట్ జిల్లాలోని ధోరాజీలో జరిగే ఎన్నికల సభలో పాల్గొంటారు. అనంతరం అమ్రేలి, బోటాడ్ లలో జరిగే ర్యాలీలో పాల్గొంటారు. ఈ ఏడాది డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ కి ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. నిన్న దక్షిణ గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ జిల్లాలో మోడీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement