Thursday, April 25, 2024

సమ్​ బాండ్స్​ ఆర్​ సో స్సెషల్​.. స్పెషల్​ మూమెంట్​ని షేర్​ చేసిన కేటీఆర్​, వైరలవుతున్న ట్వీట్​!

కొన్ని బంధాలు ప్రత్యేకమైనవి.. (సమ్​ బాండ్స్​ ఆర్​ సో స్పెషల్​) అంటూ టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​లో ఓ ఫోటోని షేర్​  చేశారు. ఇప్పుడా ట్వీట్​లోని ఫొటోలను చూసి చాలామంది లైకులు కొడుతూ.. హ్యాపీగా కామెంట్స్​ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలేంటీ, ఆ బంధం ఏమిటనే డౌటోస్తుంది కదా.. ఇవ్వాల (శుక్రవారం) ఏం రోజో తెలుసు కదా..? అవును మీరనుకున్నది కరెక్టే! రాఖీ పండుగ.. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్వీట్లు పంచుకునే ఓ స్పెషల్​ డే..

అయితే.. ఇవ్వాల కేటీఆర్​ ట్వీట్​ చేసిన ఫొటోలో తన చిన్నప్పటి ఫొటో, తనతో పాటు తన చెల్లెలు ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవిత ఉన్నారు. ఇక మరో ఫొటోలో కేటీఆర్​ కుమారుడు హిమాన్షురావుతో పాటు కేటీఆర్​ కూతురు (హిమాన్షు చెల్లెలు) ఉన్న ఫొటో పక్కపక్కనే పెట్టి ట్వీట్​ చేశారు కేటీఆర్​. దీంతో ఈ ఫొటోని చూసిన వారంతా సంతోషపడుతూ హ్యాపీ మూమెంట్​పై బెస్ట్​ కామెంట్స్​, కాంప్లిమెంట్స్​ ఇస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement