Friday, April 19, 2024

రెండో రోజూ ఈడీ ముందు హాజరైన సోమ భరత్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడ్వకేట్ సోమ భరత్ రెండో రోజు ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. వరుసగా రెండో రోజు ఈడీ ముందు సోమ భరత్ హాజరయ్యారు. భరత్ సమక్షంలో కవిత ఫోన్ డేటాను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెల 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీ అధికారుల‌కు కవర్ లో అప్పగించారు. ఈ క్రమంలో ఆ ఫోన్లను తెరిచేందుకు సాక్షిగా కవితను కానీ ఆమె ప్రతినిధిని కానీ రావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు కోరారు. అయితే కవిత తరపున అడ్వకేట్ సోమ ఇవాళ రెండో రోజు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement