Thursday, December 1, 2022

రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన.. సోషల్ మీడియా రౌడీ భాటీ

సోషల్ మీడియాలో రౌడీ భాటిగా పేరు తెచ్చుకున్నాడు రోహిత్ భాటి. కాగా ఆయన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని బీటా-2 పోలీస్ స్టేషన్ పరిధిలోని చుహార్‌పూర్ అండర్‌పాస్ సమీపంలో జరిగింది. అతివేగమే అతని మరణానికి కారణమని తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న ఆయన కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న రోహిత్ భాటి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గ్రేటర్ నోయిడా, ఢిల్లీలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసు ఇన్‌చార్జి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు చుహార్‌పూర్ అండర్‌పాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -
   

అతివేగం కారణంగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవింగ్ సీటుపై రౌడీ భాటీ కూర్చున్నట్లు బీటా-2 స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనిల్ రాజ్‌పుత్ తెలిపారు. అతడి తలకు బలమైన గాయమైంది. ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు రౌడీ భాటీగా చనిపోయినట్లు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన మనోజ్, అతిష్‌లకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు. అయితే గాయపడిన యువకులిద్దరూ ఎక్కడ ఉన్నారనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన వారిలో ఒకరు గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీకి రిఫర్ చేసినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement