Tuesday, March 26, 2024

Smart Tech: ట్యాబ్ క‌మ్ ల్యాండ్ ఫోన్‌.. న‌యా లుక్‌.. డిఫ‌రెంట్ స్టైల్‌..

టెక్నాల‌జీ ఎంత డెవ‌ల‌ప్ అయ్యిందో మ‌నంద‌రికీ తెలుసు.. రోజు రోజుకూ కొత్త కొత్త గ్యాడ్జెట్స్ వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు ఎర్ర బ‌ట‌న్‌, గ్రీన్ బ‌ట‌న్ ఉన్న కీ ప్యాడ్ డ‌బ్బా ఫోన్ నుంచి ఇప్పుడు అత్యంత లేటెస్ట్ వ‌ర్ష‌న్స్ ఎన్నో అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే.. ఇప్ప‌టికీ కొంత‌మంది వైర్‌డ్ ఫోన్ల‌ను కైడా లైక్ చేసే వాళ్లున్నారు. రేడియేష‌న్ కానీ, మ‌రేదైనా ప్రాబ్ల‌మ్ తెలియదు ఇప్ప‌టికీ ఓల్డ్ స్టైల్ ఫోన్లు అంటే ఇంకా లైక్ చేస్తుంటారు కొంద‌రు..

అయితే.. ఈ మ‌ధ్య కాలంలో వ‌స్తున్న ట్యాబ్ వంటివి కూడా బాగా ఫేమ‌స్ అవుతున్నాయి.. వాటిని దృష్టిలో పెట్టుకుని కొంత‌మంది టెకీలు రెండు ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డేలా కొత్త‌ర‌కం ఫోన్‌ని రెడీ చేశారు దాని మోడ‌ల్‌ని ఓ టెకీ ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌డంతో చాలామంది బాగుంద‌ని కామెంట్ చేస్తున్నారు.. ఫోన్ KT5(3C), ఇది నిజానికి బ్యాటరీ, SIM కార్డ్ స్లాట్‌తో కూడిన వైర్‌లెస్ టాబ్లెట్. నేను ఊహించిన దాని కంటే కూడా క్రేజీగా ఉంది అని ఓ టెకీ దీన్ని షేర్ చేశారు. ఈ కొత్త‌ర‌కం ఫోన్ క‌మ్ ట్యాబ్ ఎట్లుందో మీరూ ఓ సారి లుక్కేయండి..

దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది.. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకుండా అప్పుడే కొనేయకండి.. ఇంకా ఇది మార్కెట్లోకి రాలేదని చాలామంది తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement