Thursday, April 18, 2024

Flash: ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి..

ఆఫ్రికా దేశాల ఫుట్‌బాల్ కప్ టోర్నీ మ్యాచ్‌ జరగడానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. కెమెరూన్ రాజధాని యువాండేలోని ఒలెంబే స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఒక్కసారిగా ప్రేక్షకులు లోపలికి వెళ్లేందుకు ఎగబడటంతో తొపులాట జరిగింది. తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రేక్షకులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికా ఫుట్‌బాల్ (సీఏఎఫ్) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేపట్టి, ఎలా జరిగిందనేది పారదర్శకంగా మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని సీఏఎఫ్ తెలిపింది. తొక్కిసలాటలో గాయపడిన 40 మంది తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మెస్సాస్సే వైద్యులు తెలిపారు.

కాగా, స్టేడియం సామర్ధ్యం 60 వేలుకాగా.. కోవిడ్ నేపథ్యంలో 80 శాతం మందిని అనుమతించాలని నిర్ణయించారు. మ్యాచ్ చూడటానికి 50వేల మందికిపైగా హాజరయినట్టు అధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement